Page Loader
ఈనెల 10 నుంచి వారాహి యాత్ర.. మూడో విడత కోసం కమిటీల నియామకం
మూడో విడత కోసం కమిటీల నియామకం

ఈనెల 10 నుంచి వారాహి యాత్ర.. మూడో విడత కోసం కమిటీల నియామకం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 09, 2023
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి రాజకీయం వేడెక్కనుంది. ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా చేపట్టిన వారాహి యాత్రలో ఇప్పటికే రెండు యాత్రలను పవన్ విజయవంతంగా నిర్వహించారు. తాజాగా ఆగస్ట్ 10 నుంచి మూడో విడత యాత్ర జరగనుంది. వైసీపీ పాలనకు స్వస్తి పలకేందుకు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలకు యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది. గరువారం విశాఖపట్నం వేదికగా మూడో విడత యాత్ర ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు యాత్ర సమన్యయం కోసం, పార్టీ అధిష్టానం పలు కమిటీలను ఏర్పాటు చేసింది.

DETAILS

కమిటీల వివరాలు ప్రకటించిన జనసేన

కమిటీల సమన్వయకర్త : మల్నీడి తిరుమలరావు క్యాటరింగ్ కమిటీ : బండి రామకృష్ణ, మధు వీరేశ్, కత్తిపూడి బాబీ, మోకా నాని, రావాడ నాగు, కె.రామారావు, సత్తిబాబు, గల్లా తిమాతి, మేడిద దుర్గాప్రసాద్, సుందరనీడి పట్టాభిరామయ్య,మాగాపు వీర్రాజు, మొండా శివప్రసాద్. ఆపరేషన్ కమిటీ : ధవళ కీర్తేశ్, విశ్వక్షేన్, యడ్లపల్లి రాంసుందర్, తోరం శశాంక్. మెడికల్ అసిస్టెన్స్ కమిటీ : రఘు, గౌతమ్ రాజ్, డాక్టర్ లక్ష్మణ్, బి.రవికాంత్, శ్రీమతి వసంత లక్ష్మి, బత్తుల రామకృష్ణ. వాలంటీర్ల కమిటీ : బోడపాటి శివదత్, చాగంటి మురళీకృష్ణ, కొరియర్ శ్రీనివాస్, పవన్ కుమార్, ఎ.విక్రమ్, శ్రీనివాస పట్నాయక్, సందు పవన్. మీడియా సమన్వయ కమిటీ : పీలా రామకృష్ణ, బొలియాశెట్టి శ్రీకాంత్, ఆళ్ల హరి, వి.సతీశ్, వీఎన్ఎస్ చంద్రరావు.