తదుపరి వార్తా కథనం

Pawan kalyan: డాక్టరేట్‌ను తిరస్కరించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్
వ్రాసిన వారు
Stalin
Jan 06, 2024
05:46 pm
ఈ వార్తాకథనం ఏంటి
Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అరుదైన గౌరవం దక్కింది.
తమిళనాడులోని వేల్స్ యూనివర్సిటీ పవన్ కళ్యాణ్‌కు డాక్టరేట్‌ను ప్రకటించారు.
ఈ మేరకు తాము ప్రధానం చేయనున్న డాక్టరేట్‌ను అందుకునేందుకు ఈ నెలలో జరిగే యూనివర్సిటీ 14వ కన్వకేషన్‌కు హాజరుకావాలని విశ్వవిద్యాలయం నిర్వాహకులు పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు.
కానీ, పవన్ కల్యాణ్ మాత్రం డాక్టరేట్‌ను సున్నితంగా తిరస్కరించారు.
వివిధ రంగాలలో రాణించిన వారు చాలా మంది ఉన్నారని.. వారికి ఇవ్వాల్సిందిగా కోరారు.
ఈ మేరకు వేల్స్ యూనివర్సిటీకి పవర్ స్టార్ లేఖ రాశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో తాను కన్వకేషన్ కార్యక్రమానికి రాలేకపోతున్నట్లు ఆ లేఖలో పవన్ కళ్యాణ్ రాసుకొచ్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సున్నితంగా తిరస్కరించిన పవన్ కళ్యాణ్
#PawanKalyan Rejects doctorate 🙏 pic.twitter.com/g9Fc13pp3f
— Pawanism Network (@PawanismNetwork) January 5, 2024