Page Loader
పోలీసుల ఆంక్షల మధ్య రుషికొండకు బయల్దేరిన పవన్.. రోడ్లను దిగ్భంధించిన పోలీసులు
రోడ్లను దిగ్భంధించిన పోలీసులు

పోలీసుల ఆంక్షల మధ్య రుషికొండకు బయల్దేరిన పవన్.. రోడ్లను దిగ్భంధించిన పోలీసులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 11, 2023
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మళ్లీ వేడెక్కిస్తున్నాయి. విశాఖ నగరంలోని రుషికొండను పరిశీలించేందుకు పవన్ కల్యాణ్ బయల్దేరారు. ఈ మేరకు పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. జోడుగుళ్లపాలెం గుండా వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదని పేర్కొన్నారు. ర్యాడిసన్ బ్లూ హోటల్ నుంచి పవన్ వాహనానికి మాత్రమే అనుమతుందన్నారు. అయితే రుషికొండకు ఎదురుగా ఉన్న రోడ్డులోనే జనసేనాని ప్రయాణించాలని, కొండపైకి మాత్రం వెళ్లకూడదని షరతు విధించారు. కావాలంటే గీతం వర్శిటీ వద్ద పాత్రికేయులతో మాట్లాడుకోవచ్చని మినహాయింపు ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా గురువారం పవన్ రెచ్చగొట్టే రీతిలో మాట్లాడారన్నారు. విద్వేషాలు తెచ్చే మాటలు మాట్లాడకుండా ఉండాలని, పోలీసుల నిబంధనలు పాటించాలని సూచించారు.

embed

రుషికొండకు బయల్దేరిన పవన్ కల్యాణ్

రుషికొండ నిషిద్ధ ప్రాంతమా..? రుషికొండ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలు పరిశీలించేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు అన్న సమాచారం అందుకున్న పోలీసులు ఋషికొండ కి వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధనం చేశారు. సామాన్య ప్రజలను సైతం కనీసం వెళ్ళనివ్వలేదు. ఋషికొండ... pic.twitter.com/6aKMlackVX— JanaSena Party (@JanaSenaParty) August 11, 2023

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రుషికొండ మార్గలను దిగ్బంధనం చేసిన పోలీసులు