తదుపరి వార్తా కథనం
విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్.. సాయంత్రం జగదాంబ సెంటర్ లో వారాహి యాత్ర
వ్రాసిన వారు
TEJAVYAS BESTHA
Aug 10, 2023
03:06 pm
ఈ వార్తాకథనం ఏంటి
మూడో విడత వారాహి యాత్ర ఇవాళ విశాఖపట్టణంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు చేరుకున్నారు.
విశాఖ విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఇదే సమయంలో జనసేన వీరమహిళలు తమ అధినాయకుడికి హారతులు పట్టారు. సాయంత్రం నగరంలోని జగదాంబ సెంటర్ లో మూడో విడత వారాహి యాత్ర మొదలుకానుంది. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నట్లు పార్టీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
మరోవైపు యాత్రకు షరతులతో కూడిన అనుమతి బుధవారం లభించగా, యాక్ట్ 30 అమల్లో ఉందని పోలీసులు వెల్లడించారు.
పవన్ పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ పై మరింత స్పష్టత రావాలని జనసేన వర్గాలు అంటున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విశాఖ చేరుకున్న జనసేనాని పవన్ కల్యాణ్
విశాఖ చేరుకున్న శ్రీ @PawanKalyan గారు#VarahiVijayaYatra#HelloAP_ByeByeYCP pic.twitter.com/ok38dn1pUZ
— JanaSena Party (@JanaSenaParty) August 10, 2023