Page Loader
జనగామలో దారుణం: భార్య ఉరేసుకుందని రివాల్వర్‌తో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య
జనగామలో దారణం: భార్య ఉరేసుకుందని రివాల్వర్‌తో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

జనగామలో దారుణం: భార్య ఉరేసుకుందని రివాల్వర్‌తో కాల్చుకొని ఎస్ఐ ఆత్మహత్య

వ్రాసిన వారు Stalin
Apr 06, 2023
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

జనగామలో గురువారం దారుణం జరిగింది. జనగామ స్థానిక పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్ కె శ్రీనివాస్ తన సర్వీస్ రివాల్వర్‌‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో భార్య ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాస్‌ భార్య గురువారం ఉదయం బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని కనిపించింది. ఈ వార్త బయటకు రావడంతో పోలీసులు అతని ఇంటికి చేరుకోగా, ఎస్‌ఐ అప్పటికే తన సర్వీస్ వెపన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.

జనగామ

దంపతుల మధ్య బుధవారం రాత్రి గొడవ

శ్రీనివాస్ కుమారుడు-కోడలు మధ్య కలహాలు ఉన్నట్లు తెలిసిందని, ఆ కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సబ్-ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, అతని భార్య ఆత్మహత్యపై డీసీపీ సీతారామ్ స్పందించారు. శ్రీనివాస్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారి హైదరాబాద్‌లో ఉంటున్నట్లు చెప్పారు. శ్రీనివాస్, అతని భార్య స్వరూప మధ్య బుధవారం ఆర్థిక సంబంధిత విషయాలపై గొడవ జరిగినట్లు చెప్పారు. అయితే ఆత్మహత్యకు కారణం ఏంటనేది విచారణ తర్వాతే తెలుస్తుందని చెప్పారు.