నిజామాబాద్: మెడికల్ కాలేజీ హాస్టల్ గదిలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య
ఈ వార్తాకథనం ఏంటి
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి తన హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పాల్పడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. మృతి చెందిన విద్యార్థిని దాసరి హర్ష (22)గా గుర్తించారు.
ఈ ఘటన శనివారం ఉదయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. దాసరి హర్ష ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై ఇంకా కారణాలు తెలియ రాలేదని పోలీసులు వెల్లడించారు.
నిజామాబాద్
హర్ష తెలివైన విద్యార్థి: కళాశాల ప్రిన్సిపల్ ఇంద్ర
శుక్రవారం రాత్రి హర్ష తన తోటి విద్యార్థులతో సరదాగా గడిపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే రాత్రి భోజనం చేసిన అనంతరం తన గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
హర్ష స్వస్థలం మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం చింతగూడ గ్రామం కాగా తండ్రి శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు తల్లి ఇంటి వద్దే ఉంటోంది.
హర్ష ఆత్మహత్యపై నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ కె. ఇంద్ర స్పందించారు. అతను తెలివైన విద్యార్థి అని, ఎందుకు ఇలా చేసుకున్నాడో తెలియదని పేర్కొన్నారు.