Page Loader
10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1: వరంగల్ సీపీ రంగనాథ్
10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1: వరంగల్ సీపీ రంగనాథ్

10వ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్ ఏ1: వరంగల్ సీపీ రంగనాథ్

వ్రాసిన వారు Stalin
Apr 05, 2023
06:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

10వ తరగతి హిందీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ వ్యవహారంపై వరంగల్ సీపీ రంగనాథ్ బుధవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. హిందీ పరీక్ష ప్రశ్నపత్రం కమలాపూర్ సర్కారు పాఠశాల నుంచి లీకైనట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసులో బండి సంజయ్‌ను ఏ1గా చేర్చినట్లు పేర్కొన్నారు. ఏ2గా బూరా శ్రీశాంత్, ఏ3గా గుండబోయిన మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా శివ గణేషష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ కేసులో మరో నలుగురు పరారీలో ఉన్నట్లు సీపీ వెల్లడించారు.

బండి సంజయ్

శ్రీశాంత్- బండి సంజయ్ అనేక సార్లు ఫోన్ సంభాషణ: సీపీ

పరీక్ష పేపర్ లీకైన కేంద్రంలోని బాధ్యులపై విద్యాశాఖ ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. హిందీ ప్రశ్నపత్రాన్ని ఏ2గా ఉన్న బూరా శ్రీశాంత్ అనేక మందికి వాట్సాప్ ద్వారా షేర్ చేసినట్లు సీపీ రంగనాథ్ పేర్కొన్నారు. శ్రీశాంత్-బండి సంజయ్ మధ్య అనేక సార్లు ఫోన్ సంభాషణ జరిగిందని చెప్పారు. బండి సంజయ్ ఫోన్ ఇస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయని వివరించారు. ప్రశ్న పత్రం అనేకమందికి షేర్ చేశారని అందులో అనేక మంది బీజేపీ నేతలు, జర్నలిస్టులు ఉన్నారన్నారు. అయితే అందరిపై కేసులు నమోదు చేయలేదన్నారు. అంతకు ముందు శ్రీశాంత్- బండి సంజయ్ మధ్య నెలకొన్న పరిణామాల నేపథ్యంలో కేసులు నమోదు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.