రెండోరోజు కూడా 10వ తరగతి పేపర్ లీక్! విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
తెలంగాణలో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షల్లో మంగళవారం హిందీ పేపర్ లీకైంది. తాండూరులో సోమవారం తెలుగు పేపర్ లీక్ అయిన రీతిలోనే వరంగల్‌లో పదో తరగతి హిందీ పేపర్ బయటకు వచ్చింది. ఇది వాట్సాప్‌లో కూడా లీక్ అయింది. అయితే ఎవరు లీక్ చేశారన్నది ఇంకా తేలలేదు. వరుసగా రెండో రోజు ఈ రెండో పేపర్ లీకేజీ విద్యార్థులను, తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసింది.
నివేదిక కోరినట్లు పాఠశాల విద్యాశాఖ
వరంగల్ జిల్లాలో హిందీ ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ నివేదికను కోరింది. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కాగానే, పూర్వపు వరంగల్ జిల్లాలోని ఒక కేంద్రంలో ద్వితీయ భాష (హిందీ) ప్రశ్న లీక్ అయినట్లు ప్రచారం జరిగింది. ఇదే అంశంపై సమగ్ర నివేదిక కోరినట్లు పాఠశాల విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి