Andeshree: 'జయ జయహే తెలంగాణ' రచయిత అందెశ్రీ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రసిద్ధ కవి, రచయిత అందెశ్రీ (64) శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురైన తర్వాత, కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ సిద్ధిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు. ప్రారంభ జీవితంలో ఆయన గొర్రెల కాపరిగా పనిచేశారు, తర్వాత భవన నిర్మాణ కార్మికుడిగా జీవనం సాగించారు. పాఠశాల చదువులు లేనప్పటికీ, కవిగా ప్రతిభ చూపిస్తూ విశేష గుర్తింపు పొందారు.
Details
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర
అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. ఆయన రాసిన 'మాయమైపోతున్నడమ్మా' పాటతో మంచి ఖ్యాతిని సంపాదించారు. ఈ రచయితకు కాకతీయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ డిగ్రీ అందింది. ఆయన రాసిన 'జయ జయహే తెలంగాణ'ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రగీతంగా ప్రకటించింది. తాజాగా, తెలంగాణ ప్రభుత్వం ఆయనకు రూ. 1 కోటి పురస్కారం అందించిన విషయం తెలిసిందే.