LOADING...
Jharkhand floor test: నేడు జార్ఖండ్‌లో చంపయ్ సోరెన్ ప్రభుత్వానికి బలపరీక్ష
Jharkhand floor test: నేడు జార్ఖండ్‌లో చంపయ్ సోరెన్ ప్రభుత్వానికి బలపరీక్ష

Jharkhand floor test: నేడు జార్ఖండ్‌లో చంపయ్ సోరెన్ ప్రభుత్వానికి బలపరీక్ష

వ్రాసిన వారు Stalin
Feb 05, 2024
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను అరెస్టు తర్వాత జార్ఖండ్ కొత్త సీఎంగా చంపయ్ సోరెన్ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే చంపయ్ సోరెన్ ప్రభుత్వం సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది. ఈ మేరకు అధికార కూటమిలోని భాగస్వామ్య పార్టీలు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ వేర్వేరుగా విప్‌లు జారీ చేశాయి. అసెంబ్లీలో ఉదయం 11 గంటలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తొలి ప్రసంగం చేస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ తన మెజారిటీని నిరూపించుకోనున్నారు. అయితే, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా తన ఓటు హక్కను వినియోగించనున్నారు. ఈ మేరకు కోర్టు కూడా ఆయనకు అనుమతి ఇచ్చింది.

 జార్ఖండ్ 

హైదరాబాద్ నుంచి రాంచీకి చేరుకున్న ఎమ్మెల్యేలు

చంపయ్ సోరెన్ ప్రమాణస్వీకారం తర్వాత అధికార కూటమి ఎమ్మెల్యేలను ఫిబ్రవరి 2న హైదరాబాద్‌ క్యాంపుకు తరలించారు. సోమవారం విశ్వాస పరీక్ష నేపథ్యంలో ఓటు వేసేందుకు అధికార కూటమి ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి రాంచీ చేరుకున్నారు. చంపయ్ సోరెన్ మంత్రివర్గ విస్తరణ ఫిబ్రవరి 7న జరగే అవకాశం ఉంది. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం సీట్లు- 81 మెజారిటీకి మద్దతు కావాలి - 41 చంపయ్ సోరెన్‌కు మద్దతుగా సంతకం చేసినవారు - 43 అసెంబ్లీలో బలాబలాలు.. జేఎంఎం- 29 కాంగ్రెస్ - 17 సీపీఐ(ఎంఎల్)-01 ఆర్జేడీ-01 నామినేటెడ్ ఎమ్మెల్యే -01 బీజేపీ-26 ఏజేఎస్‌యూ- 03 ఇతరులు - 02 ఎన్‌సీపీ - 01 ఖాళీ సీటు- 01