Page Loader
ఇండియాపై కాంగ్రెస్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు.. వలసవాద దేశం పెట్టిన పేరుపై జిన్నాకూ అభ్యంతరం
వలసవాద దేశం పెట్టిన పేరుపై జిన్నాకూ అభ్యంతరం

ఇండియాపై కాంగ్రెస్ నేత శశిథరూర్ కీలక వ్యాఖ్యలు.. వలసవాద దేశం పెట్టిన పేరుపై జిన్నాకూ అభ్యంతరం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 06, 2023
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం ఇండియాకు బదులుగా భారత్ గా మార్చడంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పేరును భారత్ కూటమిగా మార్చుతామన్నారు. దీంతో దేశానికి పేర్లు మార్చే వికృత క్రీడను కేంద్ర ప్రభుత్వం ఆపేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ఇండియా పేరుపైనా పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా అభ్యంతరం వ్యక్తం చేశారని థరూర్ గుర్తు చేశారు. బ్రిటీష్ వలసపాలన నుంచి దేశానికి విముక్తి లభించిన సమయంలో, సామ్రాజ్యవాదం పెట్టిన ఇండియా పేరును ఆయన వ్యతిరేకించారన్నారు. భారతదేశాన్ని 'భారత్' అని పిలిచేందుకు రాజ్యాంగపరంగా ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం మూర్ఖంగా వ్యవహరించకూడదన్నారు. ఇండియాతో పాటు భారత్ కూడా వినియోగంలో ఉండాలన్నారు.

EMBED

ఇండియాను భారత్ అని పిలుచుకోవచ్చు 

No comment. Happy to agree with the Government on this! pic.twitter.com/3bGbl3CbaA— Shashi Tharoor (@ShashiTharoor) September 5, 2023

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కూటమి పేరును భారత్ గా మారుస్తామన్న శశిథరూర్