మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్; అసలు ఆయన ఎవరో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో అజిత్ పవార్ ఉదంతం నేపథ్యంలో రాజకీయ పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి.
మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడు అజిత్ పవార్ ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో అజిత్ స్థానంలో మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా జితేంద్ర అవద్‌ను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నియమించింది. ఈ మేరకు ఆదివారం అర్థరాత్రి అవద్ నియామక పత్రాన్ని మహారాష్ట్ర స్పీకర్ కార్యాలయంలో ఎన్‌సీపీ నాయకులు అందజేశారు.
తాను శరద్ పవార్‌కు అండగా నిలిచానని అవద్ చెప్పారు. గడచిన 25 ఏళ్లలో పార్టీ తమను మంత్రులను చేసిన విషయాన్ని రెబల్స్ మర్చిపోకూడదన్నారు.
మహారాష్ట్ర
జితేంద్ర అవద్ నేపథ్యం ఇదే
59ఏళ్ల జితేంద్ర అవద్ థానే జిల్లాలోని ముంబ్రా-కాల్వా నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శరద్ పవార్‌కు అత్యంత నమ్మకస్థుడు.
విద్యార్థి కార్యకర్తగా జితేంద్ర అవద్ రాజకీయాల్లోకి వచ్చారు.
1988లో మహారాష్ట్ర ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శిగా, 1991లో ఆల్ ఇండియా ఎన్ఎస్యూఐ ప్రధాన కార్యదర్శిగా, 1996లో మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అవద్ నియమితులయ్యారు.
శరద్ పవార్ కాంగ్రెస్ నుంచి విడిపోయినప్పుడు అవద్ కూడా ఆయన వెంట నడిచారు.
శరద్ పవార్ విధేయుడిగా పేరున్న అవద్ మహారాష్ట్ర శాసన మండలి సభ్యునిగా రెండు సార్లు(2004, 2008) నామినేట్ అయ్యారు.
అవద్ 2014లో మహారాష్ట్ర కేబినెట్ మెడికల్ ఎడ్యుకేషన్ & హార్టికల్చర్ మంత్రిగా, 2019లో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంలో హౌసింగ్ మంత్రిగా పనిచేశారు.