జేఎన్‌యూ కొత్త నిబంధనలు: ధర్నా చేస్తే రూ.20వేల ఫైన్; హింసకు పాల్పడితే అడ్మిషన్ రద్దు
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. యూనివర్సిటీలో శాంతి భద్రతలను విఘాతం కలగకుండా ఉండేందుకు 'రూల్స్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ ప్రాపర్ కండక్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ జేఎన్‌యూ' పేరుతో 10 పేజీల రూల్ బుక్‌ను తీసుకొచ్చింది. యూనివర్శిటీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కొత్త నిబంధనలను ఆమోదించింది. కొత్త నిబంధనల ప్రకారం, యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నాలు చేస్తే రూ.20వేల జరిమానా విధించనున్నారు. అలాగే విశ్వవిద్యాలయంలో హింసకు పాల్పడితే అడ్మిషన్ రద్దు లేదా రూ. 30వేల జరిమానా విధిస్తారు.
కొత్త నిబంధనలను వెనక్కి తీసుకోవాలి: ఏబీవీపీ
మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని యూనివర్సిటీలో ప్రదర్శించినప్పుడు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. అయితే కొత్త నిబంధనావళిపై విద్యార్థి సంఘాలు మండిపతున్నాయి. కఠినమైన ప్రవర్తనా నియమావళిని వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ కార్యదర్శి వికాస్ పటేల్ డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 3నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు యూనివర్సిటీ అధికారులు చెప్పారు.