Coal India Jobs 2026: 10వ తరగతి పాస్‌తోనే జాబ్స్..బొగ్గు గనుల్లో భారీ నియామకాలు - రూ.50 వేల వరకూ జీతం!
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర బొగ్గు గనుల శాఖకు చెందిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో ఉన్న కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 1055 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో మైనింగ్ సర్దార్, డిప్యూటీ సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్‌మెన్ పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 15, 2026 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు
అర్హతలు
ఈ పోస్టులకు అప్లై చేయాలంటే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా మైనింగ్ ఇంజనీరింగ్‌లో మూడు సంవత్సరాల డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదనంగా మైనింగ్ సర్దార్‌షిప్, గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ లేదా సర్వేయర్ కంపిటెన్సీ సర్టిఫికేట్లు తప్పనిసరిగా ఉండాలి. వయోపరిమితి అభ్యర్థుల వయసు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
వివరాలు
ఎంపిక విధానం & జీతం
అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.47,330 జీతంతో పాటు ఇతర భత్యాలు కూడా అందిస్తారు. రాత పరీక్ష విధానం రాత పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి, మొత్తం మార్కులు 100. ఇందులో టెక్నికల్ నాలెడ్జ్ నుంచి 80 ప్రశ్నలు (80 మార్కులు), జనరల్ అవేర్‌నెస్/ఆప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు) అడుగుతారు. ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ లేదు. ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ రంగంలో మంచి ఉద్యోగావకాశం లభించనుంది.