
Jogulamba Gadwal district: ప్రైవేట్ బస్సులో చెరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో శనివారం చిత్తూరు వెళ్లే ప్రైవేట్ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి.
ఆ మంటల్లో పడి ఓ మహిళ సజీవదహనమైనట్లు పోలీసులు తెలిపారు.
శనివారం తెల్లవారుజామున 3 గంటలకు జగన్ అమెజాన్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
డ్రైవర్ నిద్రమత్తులో బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. అనంతరం బస్సు బోల్తాపడి మంటలు చెలరేగాయని పోలీసులు వెల్లడించారు.
బస్సులో మంటలు చెరేగిన వెంటనే ప్రయాణికులు వెంటనే బస్సు దిగారు.
కానీ మహిళ చేయి ఇరుక్కుపోవడంతో ఆమె కిందకు దిగలేక సజీవదహనమైంది.
ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన నలుగురిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాలిపోతున్న బస్సు
A Volvo bus going from Hyderabad to Bengaluru overturned at Beechupally 10th Police Battalion, Jogulamba Gadwal district on Saturday at around 3am. A fire broke out in the bus immediately after it overturned.
— Revathi (@revathitweets) January 13, 2024
The bus apparently was running full capacity. Many injured and at least… pic.twitter.com/Pjyecsu0Lp