PM Modi invites NDA: ఎన్డీఏ కూటమిలో చేరాల్సిందిగా ఎన్సీపీ, శివసేనలకు మోదీ ఆహ్వానం
ఎన్సీపీ , శివసేన పార్టీలను ఎన్డీఏ కూటమిలో చేరాల్సిందిగా ఆ పార్టీల అధ్యక్షులు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలన్నీ కలసి కూటమిగా రావచ్చని లేదా కాంగ్రెస్ లో కలసిపోవచ్చని శరద్ పవర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా మోదీ ఈ ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో పార్టీలను విలీనం చేసి చనిపోయేకన్నా మీరు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ ల వద్దకు వెళితే ఎన్డీఏ చేరేందుకు దారి తెరిచే ఉందని ఈ సందర్భం మోదీ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ లో విలీనమైతే పూర్తిగా కనుమరుగైపోవడమే...
కాంగ్రెస్ లో ప్రాంతీయ పార్టీలు విలీనమైతే ఇక ఆ పార్టీలు పూర్తిగా కనుమరగైపోవడమేనని హెచ్చరించారు. నలభై ఏభై ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో పెద్ద నేతగా ఉన్న నేత బారామతి లోక్ సభ స్థానానికి పోటీ చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారని శరద్ పవార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో ఎన్సీపీని, శివసేనను విలీనం చేయడం వారికి నకిలీ ఆలోచనా విధానానికి అద్దం పడుతుందన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు శరద్ పవార్ స్పందిస్తూ..ఇటీవల మోదీ తన ప్రసంగాల్లో ప్రజల్లో విద్వేషాన్ని నింపుతున్నారని ఇది దేశానికి ప్రమాదకరమన్నారు. ఇటువంటి భావజాలం ఉన్నవారితో తాను ఇమడలేనని శరద్ పవార్ ప్రధాని మోదీ ఆహ్వానాన్ని తిరస్కరించారు.