Page Loader
జమ్ముకశ్మీర్‌లో జోషిమఠ్ తరహా పరిస్థితులు, రోజురోజుకు కుంగిపోతున్న 'దోడా' ప్రాంతం
జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో రోజురోజుకు కుంగిపోతున్న భూమి

జమ్ముకశ్మీర్‌లో జోషిమఠ్ తరహా పరిస్థితులు, రోజురోజుకు కుంగిపోతున్న 'దోడా' ప్రాంతం

వ్రాసిన వారు Stalin
Feb 03, 2023
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్, కర్ణప్రయాగ్‌లో భూమి కుంగిపోయి ఇళ్లకు పగుళ్లు ఎలా ఏర్పడ్డాయో, అలాంటి పరిస్థితులే తాజాగా జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలో నెలకొన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళకు గురవుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా ఆరు భవనాలకు పగుళ్లు వచ్చాయని, భూములు మునగడం, కుంగిపోవడం వంటి సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అధికారులు తెలిపారు. దోడా జిల్లాలో డిసెంబర్‌లో ఒక ఇంట్లో పగుళ్లు వచ్చినట్లు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అథర్ అమీన్ జర్గర్ పేర్కొన్నారు. తాజాగా ఆరు భవనాలకు క్రాక్‌లు వచ్చినట్లు గుర్తించామని, ఇప్పుడు అవి పెరిగినట్లు అమీన్ జర్గర్ వెల్లడించారు.

దోడా

సురక్షిత ప్రాంతాలకు 20 కుటుంబాల తరలింపు

ఈ ప్రాంతం క్రమంగా మునిగిపోతోందని, ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తోందని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అథర్ అమీన్ జర్గర్ పేర్కొన్నారు. దోడా జిల్లాలోని థాత్రి మున్సిపాలిటీలోని నయీ బస్తీ ప్రాంతంలో ఇళ్లు పగుళ్లు ఏర్పడి, భూమి కుంగిపోవడం వల్ల 20 కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు మారాయి. మానవ నిర్మాణాల వల్ల భుమి స్థానభ్రంశం చెంది, ఈ ప్రాంతంలో భూమి రోజురోజుకు కుంగిపోతోంది. స్థానిక పరిపాలన అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి స్థానికులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. నిపుణుల బృందం ఆ ప్రాంతాన్ని పరిశీలించి, సురక్షితం కాదని ప్రకటించిన తర్వాత ప్రభావిత ప్రాంతంలోని ప్రజలను శిబిరాలకు తరలిస్తున్నారని అమీన్ జర్గర్ చెప్పారు.