
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక.. రేపు నోటిఫికేషన్ విడుదల!
ఈ వార్తాకథనం ఏంటి
రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. ఎన్నికల సంఘం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్‌ను రేపు అధికారికంగా విడుదల చేయనుంది. నామినేషన్ల షెడ్యూల్ నామినేషన్ల స్వీకరణ: రేపటి నుంచి 21వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన: 22వ తేదీ ఉపసంహరణ: 24వ తేదీ వరకు జిల్లా ఎన్నికల సంఘం నామినేషన్ల స్వీకరణకు పూర్తి ఏర్పాట్లు చేసింది. షేక్‌పేట్ తహసిల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ ఈ ఏర్పాట్లను పరిశీలించారు. సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం రిటర్నింగ్ అధికారిగా నామినేషన్లు స్వీకరిస్తారు.
Details
పోలింగ్ షెడ్యూల్
పోలింగ్: వచ్చే నెల 11వ తేదీ ఓట్లు లెక్కింపు: 14వ తేదీ ప్రచార పరిస్థితులు ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు గట్టి ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థిని ప్రకటించగా బీజేపీ అభ్యర్థిని ఎంపిక చేసుకునే ప్రక్రియలో ఉంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల కోలాహలం నెలకొంది.