LOADING...
Jubilee Hills by poll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించిన బీఆర్ఎస్!
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించిన బీఆర్ఎస్!

Jubilee Hills by poll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించిన బీఆర్ఎస్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2025
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్నాయి. ఒక్క తప్పిదం కూడా చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ముందస్తు వ్యూహంగా కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే పీజేఆర్‌ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి చేత కూడా నామినేషన్ దాఖలు చేయించింది. అసలు బీఆర్ఎస్ తరఫున ప్రధాన అభ్యర్థి మాగంటి సునీత ఇప్పటికే మూడు సెట్ల నామినేషన్లను సమర్పించారు.

Details

40 మంది ప్రచార కర్తల జాబితా రిలీజ్

అయితే అనుకోని కారణాలతో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు తలెత్తవచ్చన్న అంచనాతో ప్రత్యామ్నాయ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి ద్వారా కూడా నామినేషన్ వేసింది. దీనిని పార్టీ నాయకత్వం ఒక ముందస్తు జాగ్రత్త చర్యగా భావిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ జనరల్ క్యాంపెయిన్‌లో దూకుడుగా దిగింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారానికి 40 మంది ప్రచారకర్తల జాబితాను విడుదల చేసింది. అందులో ముఖ్య నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సముచిత స్థానం దక్కించుకున్నారు. ఆసక్తికరంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఆ జాబితాలో చోటు పొందారు.