LOADING...
MLC Kavitha: లిక్కర్ కేసులో కవిత బెయిల్ పై నేడు తీర్పు 
లిక్కర్ కేసులో కవిత బెయిల్ పై నేడు తీర్పు

MLC Kavitha: లిక్కర్ కేసులో కవిత బెయిల్ పై నేడు తీర్పు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2024
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ, ఈడీ కేసులకు సంబంధించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టు సోమవారం నిర్ణయాన్ని ప్రకటించనుంది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై రూస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కావేరీ బవేజా ఉత్తర్వులను మే 6వ తేదీకి రిజర్వ్ చేశారు. లిక్కర్ ఈడీ,సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు.ఈ రెండు కేసుల్లో ఈడీ,సీబీఐ వాదనలు ముగిశాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ కవిత మహిళ కావడంతో బెయిల్‌కు అర్హురాలని,ఈ కేసులో ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌లలో ఆమె కూడా ఒకరు.