Page Loader
Amaravati: అమరావతిలో తుది దశకు చేరిన జంగిల్ క్లియరెన్స్ పనులు
అమరావతిలో తుది దశకు చేరిన జంగిల్ క్లియరెన్స్ పనులు

Amaravati: అమరావతిలో తుది దశకు చేరిన జంగిల్ క్లియరెన్స్ పనులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2024
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజధాని అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆగస్టులో ప్రారంభమైన ఈ పనులు 24 వేల ఎకరాల్లో సుమారు రూ.36 కోట్ల వ్యయంతో చేపట్టారు. ప్రస్తుతం ఈ పనుల పురోగతి 96 శాతం వరకు చేరుకుంది. భారీ వర్షాల కారణంగా కొద్దిరోజుల పాటు ఆటంకం ఏర్పడినా, కంప చెట్ల తొలగింపు ప్రక్రియ మళ్లీ వేగంగా కొనసాగుతోంది. గుత్తేదారు సంస్థ ఎన్‌సీసీ ఈ పనులను 99 గ్రిడ్స్‌గా విభజించి, సుమారు 400 యంత్రాలను ఉపయోగించి నిర్వహిస్తున్నారు.

Details

హైదరాబాద్ నుంచి ఎనిమిది యంత్రాలు

తొలగించిన ముళ్ల చెట్లు త్వరలో ఎండిపోయాక కత్తిరించేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్‌ నుంచి ఎనిమిది యంత్రాలను తీసుకురానున్నారు. తరువాత ఈ చెట్ల ముక్కలను సిమెంట్‌ పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీసీ హయాంలో అడవిగా కనిపించిన ఈ రాజధాని నేడు రహదారులు, భవనాలతో చక్కగా రూపుదిద్దుకుంది.