
Supreme Court: సుప్రీంకోర్టు నూతన సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్
ఈ వార్తాకథనం ఏంటి
సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా భూషణ్ రామకృష్ణ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ప్రస్తుతం సీజేఐగా ఉన్న న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మే 13న పదవీ విరమణ చేయనుండటంతో, ఆయన స్థానాన్ని జస్టిస్ గవాయ్ భర్తీ చేయనున్నారు.
కొలీజియం సిఫారసు మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ జస్టిస్ గవాయ్‌ను సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా అధికారికంగా నియమించింది.
ఆరు నెలల కాలానికి ప్రధాన న్యాయమూర్తిగా సేవలు
జస్టిస్ గవాయ్ నవంబరులో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో సుమారు ఆరు నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.
ఆయన నియామకం ద్వారా 2007లో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సుప్రీంకోర్టు సీజేఐగా బాధ్యతలు చేపట్టిన రెండో దళిత న్యాయమూర్తిగా చరిత్రలోకి ఎక్కనున్నారు.
Details
న్యాయ రంగంలో సుదీర్ఘ ప్రయాణం
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాదిగా తన ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. ప్రముఖ న్యాయవాది, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాజా భోన్సాలేతో కలిసి పనిచేశారు.
అనంతరం 1987 నుండి 1990 వరకు ముంబయి హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా సేవలందించారు.
1992లో ఆయన నాగ్‌పూర్ బెంచ్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ హోదాలో పనిచేశారు.
2000లో ప్రభుత్వ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలందించారు.
ఆయన 2003లో బాంబే హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులై, 2005లో శాశ్వత న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. అనంతరం 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు.