తదుపరి వార్తా కథనం

Kaleshwaram: కాళేశ్వరంపై నేడు న్యాయ విచారణ.. మేడిగడ్డకు జస్టిస్ చంద్రఘోష్
వ్రాసిన వారు
Stalin
May 07, 2024
10:56 am
ఈ వార్తాకథనం ఏంటి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈనేపథ్యంలో జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేడు మేడిగడ్డకు రానున్నారు.మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలిస్తారు.
ఆ తర్వాత ముక్తీ శ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు.కలకత్తా నుండి నిన్న మధ్యాహ్నమే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు.
నీటి పారుదల శాఖ కార్యదర్శి,ప్రత్యేక కార్యదర్శితో భేటీ అయ్యారు.
ఈ రోజుమేడిగడ్డలో న్యాయ విచారణ తర్వాత రాత్రి రామగుండం ఎన్టీపీసీ వసతి గృహంలో బస చేస్తారు.
రేపు సిద్దిపేట వెళ్ళి అక్కడ నుండి హైదరాబాద్ చేరుకుంటారు. మే 9 వ తేదీన బీఆర్ కే భవన్ లో నీటి పారుదల శాఖ అధికారులతో మరోసారి సమావేశమవుతారు.