LOADING...
Suryakanth: భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం.. 
గవాయ్ సిఫార్సులను ఆమోదించిన రాష్ట్రపతి

Suryakanth: భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2025
07:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర న్యాయశాఖ విడుదల చేసింది. జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24న ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన పదవీకాలం 2027 ఫిబ్రవరి 9 వరకు కొనసాగనుంది. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హరియాణా రాష్ట్రంలోని హిసార్ జిల్లాలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు. దాదాపు 15 నెలలపాటు సేవలందించిన తరువాత 2027 ఫిబ్రవరి 9న రిటైర్ అవుతారు. ఇదే సమయంలో, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గవాయ్ సిఫార్సులను ఆమోదించిన రాష్ట్రపతి