LOADING...
Andhra news: కదిరి, తణుకు, కొవ్వూరు మున్సిపాలిటీల హోదాల పెంపు
కదిరి, తణుకు, కొవ్వూరు మున్సిపాలిటీల హోదాల పెంపు

Andhra news: కదిరి, తణుకు, కొవ్వూరు మున్సిపాలిటీల హోదాల పెంపు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 31, 2025
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలోని మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్‌ పెంచుతూ రాష్ట్రప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన కదిరి మున్సిపాలిటీకి ఉన్న హోదాను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు స్పెషల్ గ్రేడ్‌లో కొనసాగుతున్న కదిరి మున్సిపాలిటీని సెలక్షన్ గ్రేడ్‌కు ఎత్తిచేశారు. గత రెండేళ్ల కాలంలో మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయం,జరిగిన ఖర్చులను సమీక్షించిన అనంతరం ఈ హోదా పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు మున్సిపాలిటీకి సంబంధించిన గ్రేడ్‌ను కూడా ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం గ్రేడ్-1లో ఉన్న తణుకు మున్సిపాలిటీని సెలక్షన్ గ్రేడ్‌కు అప్‌గ్రేడ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. 2022నుంచి మున్సిపాలిటీ ఆదాయ-వ్యయాలు సంతృప్తికరంగా ఉండటంతో హోదా పెంపు అవసరమని నిర్ణయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

వివరాలు 

 ఇవాళ్టి నుంచే అమల్లోకి.. 

ఇక తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీకి కూడా గ్రేడ్ పెంపు కల్పించింది. ఇప్పటివరకు గ్రేడ్-3లో ఉన్న కొవ్వూరు మున్సిపాలిటీని గ్రేడ్-1కు మార్చుతూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2021 నుంచి మున్సిపాలిటీకి లభించిన ఆదాయ వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మూడు మున్సిపాలిటీలకు సంబంధించిన హోదా మార్పులు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ అధికారిక ఆదేశాలు జారీ చేశారు.

Advertisement