
Kailash Gahlot: ఆమ్‌ఆద్మీకి గుడ్‌బై చెప్పి .. బీజేపీలో చేరిన కైలాశ్ గహ్లోత్
ఈ వార్తాకథనం ఏంటి
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
ఆప్‌లో కీలక నాయకుడిగా ఉన్న కైలాశ్ గహ్లోత్ (Kailash Gahlot) సోమవారం భారతీయ జనతా పార్టీలో (BJP) చేరారు.
గహ్లోత్, దిల్లీ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆదివారం ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు లేఖ రాశారు.
ఆ లేఖలో, దిల్లీ ప్రభుత్వం అసంపూర్తి హామీలతో ముందుకు సాగుతోందని, ఆప్ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని గహ్లోత్ ఆరోపించారు.
ప్రజలకు సేవ చేయాలనే నిబద్ధతతో స్థాపించబడిన ఆప్, ఇప్పుడు పార్టీ నేతల వ్యక్తిగత రాజకీయ ఆశయాల చట్రంలో చిక్కుకుపోయిందని తీవ్ర విమర్శలు చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీజేపీలో చేరిన కైలాశ్ గహ్లోత్
WATCH | Delhi: After joining BJP, Kailash Gahlot says "Some people might think that this decision was made overnight and under someone's pressure.... I want to tell them that I have never acted under anyone's pressure to date..." pic.twitter.com/9KjKEngtS8
— TIMES NOW (@TimesNow) November 18, 2024