
Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్
ఈ వార్తాకథనం ఏంటి
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్న ఆనకట్టలపై జరుగుతున్న విచారణ ప్రక్రియకు జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ముగింపు పలికింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్, నిర్మాణ నాణ్యత, నిర్వహణ విధానాలపై గతేడాది నుండి కమిషన్ లోతుగా దర్యాప్తు జరిపింది.
ఈ దిశగా సాంకేతిక, ఆర్థిక విధానపరమైన అంశాలపై ఇంజినీర్లు, ఉన్నతాధికారులు, సంబంధిత వ్యక్తులను విచారించింది.
వారి నుంచి అఫిడవిట్లు స్వీకరించి, వాటి ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్‌ను కూడా చేపట్టింది. కాగ్ (CAG), విజిలెన్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) నివేదికలను కమిషన్ జాగ్రత్తగా పరిశీలించింది.
Details
ఈ నెల మూడో వారం లోపల ప్రభుత్వానికి నివేదిక
అన్ని ఆధారాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని తుది నివేదిక తయారుచేసే దశకు చేరుకుంది.
మొదట్లో గత ప్రభుత్వ నేతలు కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్‌లను విచారణకు పిలవాలనే యోచనలో కమిషన్ ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం లేదనే అభిప్రాయానికి వచ్చిందని సమాచారం.
జస్టిస్ పీసీ ఘోష్ నివేదికకు తుది మెరుగులు దిద్ది, ఈ నెల మూడో వారం లోపల రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం.