Kaleshwaram Project: కాళేశ్వరంపై విజిలెన్స్ తనిఖీలు.. రికార్డుల స్వాధీనం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందా? లేదా? అనే అంశాల్లో నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. ఎర్రమంజిల్ జలసౌధలో విజిలెన్స్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. కాళేశ్వరం కార్పొరేషన్ కార్యాలయంలో పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కన్నెపల్లి, మేడిగడ్డ పంప్‌హౌస్‌కు సంబంధించిన పత్రాలతో పాటు కరీంనగర్ ఎల్‌ఎండీలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలోని కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల పత్రాలను ప్రస్తుతం అధికారులు తనిఖీ చేస్తున్నారు. అయితే మొత్తం 12 విజిలెన్స్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. మేడిగడ్డ కుంగుబాటుతో పాటు పాటు ఇతర అంశాల్లో నిజాలను తేల్చేందుకు విజిలెన్స్‌కు బాధ్యతలు అప్పగించినట్లు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.