
Kangana Ranaut: సినిమా ఇండస్ట్రీని వీడలేనన్న కంగనా.. ఎన్నికల అనంతరం కూడా బాలీవుడ్‌లో కొనసాగుతానని వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
కంగనా రనౌత్ చేసిన తాజా వ్యాఖ్యలు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గంలో ఆమె గెలుపోటములపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల అనంతరం తాను సినిమా పరిశ్రమను వదిలిపెట్టబోనని ఆమె స్పష్టత ఇచ్చారు.
తన సినిమాలు చాలా పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుతం సినీ పరిశ్రమను విడిచిపెట్టలేనని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో కొనసాగాలనే ఆమె నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రంగా మార్చుకునే అవకాశాలున్నాయి.
కాగా కంగనా రనౌత్ చివరిగా 'తేజస్' సినిమాలో కనిపించింది.
Details
7వ దశలో ఇక్కడ పోలింగ్
మరో రెండు భారీ ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నాయి.
తాజా వ్యాఖ్యలతో కంగనకు గట్టి సవాలు ఎదురవడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. ఆ స్థానంలో వ్యూహాత్మకంగా కంగనా రనౌత్‌ని బీజేపీ రంగంలోకి దింపింది.
మరి కాంగ్రెస్ పార్టీ కంచుకోటని కంగనా రనౌత్ బద్దలు కొట్టగలదా అన్న ఆసక్తి నెలకొంది.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు వల్ల ఆమె గెలుపోటములపై ఇంకా ఆసక్తి రేకెత్తిస్తోంది.
లోక్‌సభ ఎన్నికలు 7వ దశలో ఇక్కడ పోలింగ్ జరగనుంది.
జూన్ 1న 4 లోక్‌సభ స్థానాలతో పాటు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడంతో ఆ స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది.