
Kanpur: బైక్‌పై టైటానిక్' భంగిమ విన్యాసం.. రూ 12 వేలు జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
బైక్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నవీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనితో కాన్పూర్ పోలీసులు శనివారం ఓవ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వైరల్ వీడియోలో,వ్యక్తి కదులుతున్నబైక్‌పై నిలబడి 'టైటానిక్' భంగిమను ప్రయత్నిస్తున్నట్లు చూడవచ్చు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,ఈ సంఘటన నవాన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగరంలోని గంగా బ్యారేజీ ప్రాంతంలోజరిగింది.
అతనికి మోటారు వాహనాలచట్టం ఉల్లంఘన కింద రూ.12వేలు జరిమానా విధించారు.
బైక్ లపై విన్యాసాలు చేయవద్దని పోలీసులు ఎన్ని సార్లు చెప్పినా యువతలో మార్పు రావడం లేదు. ఏదైనా జరగరానిది జరిగితే వారి తల్లితండ్రులకు మానసిక క్షోభకు గురి అవుతారు.
ఇటువంటి విన్యాసాలు మన హైదరాబాద్ శివార్లలో జరుగుతున్నాయని పోలీసుల దృష్టికి వచ్చాయి. మాటు వేసి కొందరిని అరెస్ట్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..
Video: Kanpur man's 'Titanic' pose on moving bike invites police action pic.twitter.com/VaDyv4hN3W
— uday sodhi (@udaysodhi26) June 9, 2024