కరీనంగర్ మామిడి ఉత్తర భారతం ఫిదా
తెలంగాణలో పండుతున్న మామిడి పండ్లకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా కరీంనగర్‌లో పండించే మామిడికి ఉత్తర భారతంలో మంచి గిరాకీ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడి రైతులు తమ పండ్లను 'కరీంనగర్ బ్రాండ్' పేరుతో ఉత్తరాది రాష్ట్రాలైన హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు నేపాల్ కూడా ఎగుమతి చేస్తుంటారు. తద్వారా లభాలాను పొందుతున్నారు. కరీంనగర్ జిల్లాలో 6,500ఎకరాల తోటల నుంచి పండ్లు దిగుబడి అవుతున్నాయి. ఈ పండ్లను కరీంనగర్‌లోని ఫ్రూట్ మార్కెట్ కేంద్రంగా వ్యాపారులు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కరీంగర్ నుంచి వచ్చే పండ్లు చాలా రుచికరంగా ఉండటంతో ఉత్తరాది వ్యాపారులు ఇక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం కోసం ఆసక్తిని కనబరస్తున్నారు.
కరీంగర్ నేలలు మామిడి సాగుకు చాలా అనుకూలం
కరీంనగర్ నుంచి వచ్చే పండ్లు రుచికరంగా ఉండటానికి పలు కారణాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని రామడుగు, మానకొండూర్, కొత్తపల్లి, చిగురుమామిడి, కరీంనగర్ రూరల్‌తో పాటు మరికొన్ని మండలాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. అయితే ఈ మండలాల్లోని నేలల స్వభావం కారణంగా ఈ ప్రాంతంలో పండే పండ్లు చాలా రుచికరంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ నేలలు మామిడి సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయని ఉద్యానవన అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలో పండే బంగినపల్లి, తోతాపురి, హిమాయత్, అల్ఫాన్సో వంటి రకాలకు మంచి ఉత్తరాదిన గిరాకీ చాలా బాగా ఉంటుంది. అందుకే ఇక్కడి నుంచి వేళ్లే పండ్లకు ఉత్తరాది వ్యాపారులు కరీంనగర్ బ్రాండ్‌గా నామకరణం చేశారు.