
కర్ణాటకలో నీటి జగడం.. కావేరి నీటి వివాదంపై నేడు కర్ణాటక బంద్
ఈ వార్తాకథనం ఏంటి
కావేరి నీటి జగడాలతో కర్ణాటకలో తీవ్ర అసంతృప్తులు, నిరసనలు జరుగుతున్నాయి. తమిళనాడుకు కావేరీ జలాలను కన్నడ సర్కార్ విడుదల చేయడంపై కన్నడ రైతుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది.
ఈ మేరకు కన్నడ రైతు సంఘాలు ఇవాళ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపో దాటలేదు.
కళాశాలలు, పాఠశాలలు మూత పడ్డాయి. బెంగళూరు, మైసూరు నగరాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
మరోవైపు ఆందోళనకారులను రోడ్లమీదే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. మాండ్యాలో నిరసనకారులు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు.నాలుక చాచిన స్టాలిన్ ఫొటోకు రక్త తర్పణం అర్పించారు.
అర్ధరాత్రి నుంచే కర్ణాటక వ్యాప్తంగా 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. బంద్‌కు బీజేపీ, జేడీఎస్ మద్దతు ప్రకటించడం కొసమెరుపు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కావేరి జల వివాదంపై ఇవాళ కర్ణాటక బంద్
#WATCH | Pro-Kannada outfits in Karnataka's Hubballi stage protest over the Cauvery water release to Tamil Nadu. pic.twitter.com/V8nLFNzg47
— ANI (@ANI) September 29, 2023