LOADING...
Social Media: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేదించిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేదించిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక

Social Media: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేదించిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 06, 2026
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా (Social Media) ఉపయోగించకుండా నిషేధం విధించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన 17వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. పిల్లలు అధికంగా మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల వారి మనస్తత్వంపై ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఆ ప్రభావాలను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఇక ఇప్పటికే ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.

వివరాలు 

ఇదే బాటలో ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాలు  

భారత్‌లో ఈ దిశగా నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాలు కూడా సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని గతంలో సూచించినట్లు సమాచారం. పిల్లలు సోషల్ మీడియాను అధికంగా ఉపయోగించడం వల్ల కలిగే ప్రభావాలపై కర్ణాటక ప్రభుత్వం కొంతకాలంగా చర్చలు కొనసాగిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్‌లర్లతో నిర్వహించిన సమావేశంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. అదే సమయంలో పిల్లలపై సోషల్ మీడియా నిషేధం అమలు చేయాలా అనే విషయంపై వారి అభిప్రాయాలను కూడా సీఎం కోరారు. ఈ చర్చల అనంతరం ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.

Advertisement