Karnataka: కర్ణాటక బీజేపీలో చీలికలు.. రాష్ట్ర అధ్యక్షుడిపై గోకాక్ ఎమ్మెల్యే ఘాటు విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత ఘర్షణలు కేవలం కాంగ్రెస్ పార్టీకే పరిమితం అని అనుకున్నా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో కూడా బయటపడ్డాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్రపై గోకాక్ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళి తీవ్ర విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని 'బచ్చా' అని సంబోధిస్తూ జార్కిహోళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
శనివారం బెళగావిలో జరిగిన బహిరంగ సభలో రమేశ్ జార్కిహోళి మాట్లాడారు.
ఈ వేదిక నుంచి విజయేంద్రకు కఠిన సందేశం పంపాలనుకుంటున్నానని, మీరు ఓ బచ్చా అని, ఎక్కువ కాలం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండరని ఆయన పేర్కొన్నారు.
Details
జాగ్రత్తగా మాట్లాడాలి
యడ్యూరప్పను తమ నాయకుడిగా గౌరవిస్తున్నామని, ఆయనపై మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉంటామని చెప్పారు.
తాను రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగలేనని తెలిసినా, షికారిపుర నుంచి విజయేంద్ర ఇంటి వరకు నిరసన కొనసాగిస్తానని జార్కిహోళి స్పష్టం చేశారు.
తన వెంట పోలీసులు, గన్‌మెన్‌లను తీసుకురానని, ఒంటరిగా వస్తానని అంటూ విజయేంద్రకు సవాలు విసిరారు. ఈ ఇద్దరి మధ్య ఈ వివాదం బీజేపీలో అంతర్గత విభేదాలు మరింత క్షోభకు దారితీసేలా కనిపిస్తోంది.
పార్టీ సభ్యుల మధ్య ఉన్న ఈ ఘర్షణలు బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారే అవకాశముంది.