
Parameshwara: లైంగిక వేధింపులపై.. కర్ణాటక హోంమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర ఇటీవల లైంగిక వేధింపుల అంశంపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలకు లోనవుతున్నాయి.
ఇటీవల బెంగళూరులో ఓ యువతిపై జరిగిన లైంగిక దాడి ఘటనపై స్పందిస్తూ, "బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇటువంటి సంఘటనలు సాధారణమే" అని వ్యాఖ్యానించారు.
ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు హోంమంత్రి తెలిపారు.
దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. దోషిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం పోలీస్ కమిషనర్‌తో ఇప్పటికే చర్చించినట్టు చెప్పారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదని, ప్రజలు సంచరించే ప్రాంతాల్లో నిత్యం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు.
వివరాలు
సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్
అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలు పలువురు నెటిజన్ల కోపాన్ని రేకెత్తించాయి.
మహిళల భద్రత విషయంలో అత్యున్నత హోదాలో ఉన్న నేతలు బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందని, దోషులకు కఠినంగా శిక్ష విధించకుండా ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సరిగ్గా లేదని విమర్శిస్తున్నారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల ప్రకారం.. గత వారం సుద్దగుంటెపాల్య ప్రాంతంలో ఇద్దరు యువతులు రోడ్డు మీద నడుస్తుండగా, ఒక వ్యక్తి అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చి, వారిలో ఒకరిపై అసభ్యంగా ప్రవర్తించి అక్కడినుంచి పారిపోయాడు.
ఊహించని ఈ సంఘటనతో యువతులు భయంతో ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోయారు.
బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయకపోయినా,ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాలు
వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు
ఇంతకుముందు కూడా బెంగళూరులో ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలున్నాయని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
నిందితులకు కఠిన శిక్ష విధించాలని, మహిళలకు భద్రత కల్పించడంలో పోలీసులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం వీడియో ఆధారంగా బెంగళూరు పోలీసులు స్వయంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.