
అధికార పార్టీకి మరోసారి షాకిచ్చిన కర్ణాటక ఓటర్లు; 38ఏళ్లుగా ఇదే సంప్రదాయం
ఈ వార్తాకథనం ఏంటి
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కర్ణాటక ఓటర్లు స్పష్టమైన తీర్పును ఇచ్చారు. గత 38ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించారు.
అధికార మార్పుకు జై కొడుతూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. 1985 నుంచి కర్ణాటకలో అధికారంలో ఉన్న పార్టీ రెండోసారి అధికారంలోకి రాలేదు.
అయితే ఈసారి గత 38ఏళ్ల చరిత్రను తిరగరాయాలని అధికార బీజేపీ భావించినా, అది సాధ్యం కాలేదు.
ఈ సారి హంగుకు కూడా ఎలాంటి ఆస్కారం లేకుండా 130కి పైగా సీట్లతో కాంగ్రెస్ పార్టీకి కన్నడ ప్రజలు స్పష్టమైన మెజార్టీని ఇచ్చారు.
కర్ణాటక
చివరగా రామకృష్ణ హెగ్డే రెండోసారి సీఎం అయ్యారు
1983 నుంచి 1985 వరకు మైనారిటీ ప్రభుత్వంగా కొనసాగిన రామకృష్ణ హెగ్డే నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం 1985లో వరుసగా రెండో విజయాన్ని సాధించింది.
1984లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. మూడు నెలల తర్వాత 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన హెగ్డే నాయకత్వంలోని పార్టీ భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కానీ, అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే 'జనతా పరివార్' చీలిపోయింది. 1989 ఎన్నికల్లో వీరేంద్ర పాటిల్‌నేతృత్వంలో కాంగ్రెస్‌పార్టీ భారీ విజయాన్ని సాధించింది.
11నెలల తర్వాత పాటిల్ అనారోగ్యానికి గురికావడంతో ప్రజల మద్దతు లేని ఎస్ బంగారప్పను కాంగ్రెస్ సీఎం చేసింది. ఆ తర్వాత నుంచి ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి అధికారంలోకి రాలేదు.
కర్ణాటక
2018 ఎన్నికల్లో 104 సీట్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ
2018 ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలుచుకోవడం ద్వారా అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 80 సీట్లు, జేడీఎస్ 37 సీట్లు గెలుచుకుంది. ఒక స్వతంత్ర సభ్యుడు కూడా గెలిచాడు. బీఎస్పీ, కర్ణాటక ప్రజ్ఞవంత జనతా పార్టీ నుంచి ఒకరు చొప్పున విజయం సాధించారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 38.04 శాతం ఓట్లు రాగా, బీజేపీ 36.22 శాతం, జేడీ(ఎస్) 18.36 శాతం ఓట్లు సాధించాయి.
ఆ సమయంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మరియు కాంగ్రెస్, జెడి(ఎస్) పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కుమారస్వామి సిఎం అయ్యారు.
ఆపరేషన్ లోటస్ వల్ల 14నెలల్లో కాంగ్రెస్, జెడి(ఎస్) ప్రభుత్వం కూలిపోయింది. దీంతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది.
కర్ణాటక
2023 ఎన్నికల్లో 130పైగా స్థానాల్లో కాంగ్రెస్ విజయం
అసెంబ్లీ ఎన్నికలు 2023లో కాంగ్రెస్ పార్టీ కన్నడ ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. దాదాపు 136స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలను కాంగ్రెస్ గెలుచుకొంది.
గత ఎన్నికల కంటే దాదాపు 60పైగా స్థానాలను కోల్పోయిన బీజేపీ ఇప్పుడు 65సీట్లకు పరిమితం అయ్యింది.
ఈ సారి జేడీఎస్ కేవలం 19సీట్లకే పరిమితం అయ్యింది. గత ఎన్నికల కంటే దాదాపు 26సీట్లను జేడీఎస్ కోల్పోయింది.
మొత్తం మీద కర్ణాటక ఓటర్ల తమ సంప్రదాయాన్ని కొనసాగించి, మరోసారి అధికార పార్టీకి షాకిచ్చారు.