Page Loader
Heavy Snowfall: జమ్మూ కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. యూనివర్సిటీ పరీక్షలు వాయిదా
జమ్మూ కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

Heavy Snowfall: జమ్మూ కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 30, 2024
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తుండగా, జనవరి 2 వరకు దీని ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొందరు కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. అలాగే, జనవరి 3 నుంచి 6 మధ్య కశ్మీర్ డివిజన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ హిమపాతం కురిసే అవకాశం ఉందని చెప్పారు. దీని ప్రభావం జమ్మూ డివిజన్‌లోని అనేక ప్రాంతాలను ప్రభావితం చేస్తుందని స్పష్టం చేశారు. ఆదివారం అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచు కురవడంతో, హిమపాతం తొలగింపు చర్యల నేపథ్యంలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. నిలిచిన వాహనాలు గమ్యస్థానాలకు చేరుతుండగా, బనిహాల్-ఖాజిగుండ్ మధ్య రోడ్లు జారుడుగా ఉండటంతో డ్రైవర్లు నెమ్మదిగా నడపాలని పోలీసులు సూచిస్తున్నారు.

వివరాలు 

పర్యాటకులు, ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలి 

సోన్‌మార్గ్-కార్గిల్ రోడ్, భదేర్వా-చంబా రోడ్, సింథాన్ రోడ్‌తో పాటు రాజోరి,పూంచ్ నుంచి షోపియాన్ కలిపే మొఘల్ రోడ్‌లు ఇంకా హిమపాతంతో మూసుకుపోయాయి. వాతావరణం మెరుగుపడిన తర్వాత శ్రీనగర్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని అధికారులు చెప్పారు. పర్యాటకులు, ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. రైలు సర్వీసులు పునరుద్ధరించబడతాయని,అయితే ఈరోజు విస్టాడోమ్ సేవలను రద్దు చేసినట్లు ప్రకటించారు. అంతేకాక,భారీ హిమపాతం కారణంగా డిసెంబర్ 30న జరగాల్సిన కాశ్మీర్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ముఖ్యంగా కశ్మీర్‌లోని ఉత్తర,దక్షిణ ప్రాంతాల్లో విపరీతమైన హిమపాతం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ మజీద్ జమాన్ తెలిపారు. వాయిదా పడిన పరీక్షలకు త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు.