Kavach System: రైలు ప్రమాదాల నివారణకు తెలంగాణలో 'కవచ్' వ్యవస్థ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రైలు ప్రమాదాల నివారణ కోసం 'కవచ్' వ్యవస్థ అమలు కానుంది.
ఈ విధానం రైళ్లు ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రావడం లేదా ఆగిన రైలును వెనక నుంచి మరొక రైలు ఢీకొనడం వంటి ప్రమాదాలను నిరోధించడంలో కీలకంగా మారుతుంది.
ప్రస్తుతం 389 కిలోమీటర్ల రైలు మార్గంలో 'కవచ్' ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థలు అమలు చేయడం కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రక్రియను ప్రారంభించింది.
'కవచ్' వ్యవస్థను 514 కిలోమీటర్ల మార్గంలో అమలు చేయాలని దక్షిణ మధ్య రైల్వే యోచిస్తుంది.
ఇందులో తెలంగాణలో 378 కిలోమీటర్లు ఉంటాయి. ఈ వ్యవస్థ ముఖ్యంగా బల్లార్షా-కాజీపేట-విజయవాడ మార్గంలో ప్రయాణించే రైళ్ల భద్రతకు తోడ్పడనుంది.
Details
18 నెలల్లో 'కవచ్' సిస్టమ్ పూర్తి
'కవచ్' వ్యవస్థను కాజీపేట-బల్లార్షా-విజయవాడ మార్గంలో అమలు చేయడం ద్వారా, ట్రాక్‌పై ఒకే సమయానికి రెండు రైళ్ల మధ్య ప్రమాదాలు జరగకుండా నిరోధించవచ్చు.
'కవచ్' వ్యవస్థ ఏర్పాటు పనులను 2026 మే నాటికి పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం టెండర్లను నిర్వహిస్తోంది.
తాజాగా సికింద్రాబాద్-రఘునాథ్‌పల్లి మధ్య 86 కిలోమీటర్ల మేర 'కవచ్' పనులు పూర్తయ్యాయి.
ఇక రఘునాథ్‌పల్లి-కాజీపేట వరకు మరింత పురోగతి ఉంది. ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ విధానం అమలుకు తీసుకొస్తుంది.
Details
'కవచ్' సిస్టమ్ ఎలా పని చేస్తుంది
ఈ విధానం ద్వారా, రైళ్లు నిరీక్షించకుండా ముందుకు ప్రయాణించగలవు. ప్రస్తుత సిగ్నల్ విధానంలో, ఒక రైలు ఆగినప్పుడు మరొక రైలు ఎప్పటికప్పుడు బయలుదేరుతుంది.
'కవచ్' వ్యవస్థ అత్యున్నత భద్రతా ప్రమాణాలతో పని చేస్తుంది. రైల్వే ఇంజినీర్ బ్రేకులు వేయడం మరిచిపోతే, ఆటోమేటిక్‌గా బ్రేకులు పడతాయి.
ఈ విధానం రైలు పట్టాలపై RFID ట్యాగ్స్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను ఉపయోగించి, రైలు సురక్షితంగా ప్రయాణిస్తుంది.