LOADING...
తెలంగాణ: బీసీల తరహాలోనే మైనార్టీలకు లక్ష సాయం: సీఎం కేసీఆర్ వెల్లడి 
మైనార్టీలకు లక్ష సాయం అందించనున్న తెలంగాణ సర్కారు

తెలంగాణ: బీసీల తరహాలోనే మైనార్టీలకు లక్ష సాయం: సీఎం కేసీఆర్ వెల్లడి 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 23, 2023
07:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులు చేసేవారికి, చిన్న తరహా కుటీర పరిశ్రమలు నడిపే బీసీలకు లక్ష రూపాయల సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా బీసీల తరహాలోనే మైనార్టీలకు లక్ష రూపాయల సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆర్థిక స్వాల్వలంబనలో భాగంగా లక్ష రూపాయల సాయం పొందాలంటే, గ్రామాల్లో ఆదాయం లక్షన్నర కంటే తక్కువగా ఉండాలి. పట్టణాల్లో అయితే రెండు లక్షలను మించరాదు.

Details

మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామంటున్న ముఖ్యమంత్రి 

ఒక కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే లక్ష రూపాయల సాయం అందుతుంది. 2023 జూన్ 2వ తేదీ 21 - 55 వయస్సులో ఉండాలి. మైనార్టీలకు లక్ష సాయం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంలో మాట్లాడిన కేసీఆర్, పేదరికాన్ని నిర్మూలించేందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందనీ, ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టిందనీ అన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ, విభిన్నమైన సంస్కృతులను, మతాలను సమానంగా ఆదరించడంలో తెలంగాణ ముందుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.