తదుపరి వార్తా కథనం

KCR Birthday: కేసీఆర్‌కు బర్త్ డే విషెష్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వీడియో వైరల్
వ్రాసిన వారు
Stalin
Feb 17, 2024
01:51 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం పలువులు ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.
అయితే అసెంబ్లీ వేదికగా.. సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌కు చెప్పిన బర్త్ డే విషేష్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఎప్పుడు కేసీఆర్‌పై విరుచుకుపడే రేవంత్ రెడ్డి.. అసెంబ్లీకి కేసీఆర్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పి.. ప్రధాన ప్రతిపక్షాన్ని ఆశ్చర్యపరిచారు.
తొలుత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు ఎత్తగానే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారేమో అని అడ్డుకోబోయారు.
కానీ రేవంత్ రెడ్డి వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
విషెష్ చెబుతున్న రేవంత్ రెడ్డి
CM Revanth Reddy conveyed Birthday greetings to BRS Chief KCR in Assembly pic.twitter.com/9D6Tl1sALx
— Naveena (@TheNaveena) February 17, 2024