
KCR: 12న కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. అక్కడి నుంచే ఎన్నికల శంఖారావం
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి(BRS) సన్నద్ధమవుతోంది. ఈ నెల 12న కరీంనగర్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.
కరీంనగర్ నుంచే లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. కరీంనగర్ పట్టణంలోని ఎస్సాఆర్ఆర్ డిగ్రీ కాలేజీ మైదానంలో బహిరంగ సభ నిర్వహణకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.
కరీంనగర్ పార్లమెంటరీ నాయకలతో ఆదివారం బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షోలు నిర్వహించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అన్ని చోట్ల ఆయన స్వయంగా పాల్గొననున్నట్లు వెల్లడించారు.
అలాగే ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ అని కేసీఆర్ చెప్పడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణలో భవన్‌లో కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు.
— BRS Party (@BRSparty) March 3, 2024
కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ముందుగా కరీంనగర్ నేతలతో సమావేశం కొనసాగుతున్నది.
అనంతరం పెద్దపల్లి ముఖ్యనేతలతో… pic.twitter.com/Ra2B5uVBXj