KCR discharge : శుక్రవారం కేసీఆర్ డిశ్చార్జి.. సొంతింటికి వెళ్లనున్న మాజీ సీఎం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి నుంచి శుక్రవారం కేసీఆర్ డిశ్చార్జి కానున్నారు.
ఈ మేరకు బంజరాహిల్స్ లోని ఆయన సొంతింటికి వెళ్లనున్నారు. ఇంటి వద్దే కావాల్సిన వైద్య సదుపాయాలతో పాటు ఫిజియోధెరపీ సేవలు పొందనున్నారు.
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బాత్‌రూంలో జారిపడ్డ కేసీఆర్, గాయాల బారిన పడ్డారు.
దీంతో హుటాహుటిన యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా వైద్య చికిత్సలు పొందుతున్నారు.
దాదాపు 6రోజులుగా యశోద ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న కేసీఆర్ ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో ఆస్పత్రి వర్గాలు ఇంటికి వెళ్లేందుకు అనుమతిచ్చినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో కేసీఆర్ ఆరోగ్యం బానే ఉందని, భయమేమీ లేదని వైద్యులు స్పష్టం చేశారు.
DETAILS
కేసీఆర్ సాధారణ ఆహారమే తింటున్నారు : వైద్యులు
ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ ప్రగతి భవన్'ను వదిలేసి ఫామ్ హౌస్'కు షిఫ్ట్ అయ్యారు. అయితే వైద్యసేవల నిమిత్తం నందినగర్'లోని తన సొంతింటిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వాకర్ సాయంతో డాక్టర్ల పర్యవేక్షణలో నడుస్తున్నారు.
ఆస్పత్రిలోని తన రూమ్‌లో కేసీఆర్ వాకర్‌తో నడుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వేగంగా రికవరీ అవుతున్నారని వైద్యులు తెలిపారు.
ఇదే సమయంలో బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు సైతం చేయిస్తామని, ఆయన స్థిరంగా ఉన్నారని, సాధారణ ఆహారమే తింటున్నారన్నారు.
శరీరం సహకరిస్తే తక్కువ కాలంలోనే సొంతంగా నడిచే అవకాశం ఉందని, పరిస్థితి మెరుగవుతోందన్నారు.
కేసీఆర్ మానసికంగా ధృడంగా ఉన్నారని, పుస్తకాలు సైతం చదువుతున్నారని ఎంపీ సంతోష్ రావు పేర్కొన్నారు.