LOADING...
Kcr : నాకోసం ఎవరూ రావొద్దు ప్లీజ్.. త్వరలో నేనే డిశార్జ్ అవుతా 
త్వరలో నేనే డిశార్జ్ అవుతా

Kcr : నాకోసం ఎవరూ రావొద్దు ప్లీజ్.. త్వరలో నేనే డిశార్జ్ అవుతా 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 12, 2023
06:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసీఆర్'ను చూసేందుకు వేలాది మంది కార్యకర్తలు, ఆయన అభిమానులు తరలివస్తున్నారు. ఫలితంగా ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ సోమాజిగూడలోని ఆస్పత్రి ఎదుట రద్దీ నెలకొనడంతో వారిని అదుపు చేయడం కష్టంగా మారింది. దీంతో స్వయంగా కేసీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. తన కోసం వచ్చిన అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. రేపటి నుంచి కనీసం 10రోజుల వరకూ ఎవరూ రావొద్దు, నాతో పాటు ఆస్పత్రిలో ఉన్న చాలా మంది పేషెంట్లు ఉన్నారు. కింద ట్రాఫిక్'కు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అన్యదా భావించకుండా అందరూ తిరిగి ఇంటికి చేరుకోండన్నారు.తాను కోలుకున్న తర్వాత మిమ్మల్ని కలుస్తానన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆస్పత్రి ప్రాంగణమంతా ట్రాఫిక్ మయం.. దయచేసి ఎవరూ రావొద్దంటున్న కేసీఆర్