
Kaleshwaram Project: కాళేశ్వరం బ్యారేజీలపై కేసీఆర్‌కి పూర్తి బాధ్యత.. అధికారుల కమిటీ నివేదిక!
ఈ వార్తాకథనం ఏంటి
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంపై మాజీ జస్టిస్ పీసీ ఘోష్ రూపొందించిన నివేదికను అధికారుల కమిటీ సమీక్షించి, దాని సారాంశాన్ని తాజాగా వెల్లడించింది. కమిటీ పరిశీలనలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిపుణుల సలహాలకు విరుద్ధంగా కేసీఆర్, హరీష్ నివేదిక ప్రకారం, ఈ మూడు బ్యారేజీల నిర్మాణ నిర్ణయం పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుదేనని స్పష్టం చేశారు. నిపుణుల కమిటీ నివేదికను కేసీఆర్‌తో పాటు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పక్కనపెట్టినట్లు పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై ఉన్న అనుమానాలను సరైన కారణంగా చూపలేకపోయారని పేర్కొన్నారు.
Details
మంత్రివర్గ ఆమోదం లేకుండానే నిర్మాణం
ముఖ్యంగా మంత్రివర్గం ఆమోదం లేకుండానే బ్యారేజీల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైందని నివేదికలో వివరించారు. వ్యాప్కోస్ నివేదిక, డీపీఆర్‌కు ముందే బ్యారేజీల నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారనీ తెలిపారు. నాణ్యత లోపాలు, టెండర్ల విషయంలో అక్రమాలు టెండర్ ప్రక్రియ, ఓ అండ్ ఎం డిజైన్, నిర్మాణ నాణ్యతలో పలు లోపాలున్నాయని నివేదిక తేల్చింది. బ్యారేజీల నిర్మాణానికి చెందిన మొత్తం బాధ్యత అప్పటి సీఎం కేసీఆర్‌పైనే ఉందని, పాలనా నియమాల పాటింపులో ఘోరంగా విఫలమైనట్లు పేర్కొన్నారు. హరీశ్‌రావు అధికారిక విధానాలను ఉల్లంఘించి నేరుగా ఆదేశాలు జారీ చేశారని స్పష్టం చేశారు.
Details
ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌పై ఆరోపణలు
అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆర్థిక బాధ్యతల్ని పాటించలేదని, ప్రాజెక్టు బోర్డులో ఉన్న అధికారులు తమకు సంబంధం లేదని ఆయనే స్పష్టం చేశారని నివేదిక పేర్కొంది. మొత్తం ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ, నీటి నిల్వ, ఆర్థిక నిర్వహణపై సీఎం కేసీఆర్‌దే బాధ్యతగా గుర్తించారు. ప్రజాధనం దుర్వినియోగం.. క్రిమినల్ చర్యల కోసం సూచన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థల మధ్య కుమ్మక్కు ఉందని నివేదికలో పేర్కొన్నారు. బ్యారేజీలు దెబ్బతినడానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణమని తేల్చారు. నిర్మాణ స్థలం మార్పులు, అంచనాల సవరణలో పారదర్శకత లేకపోవడం వల్లే నష్టం జరిగిందని స్పష్టం చేశారు
Details
ఎల్ అండ్ టీపై కీలక వ్యాఖ్యలు
ఎల్ అండ్ టీ సంస్థకు మేడిగడ్డ నిర్మాణంపై ఎలాంటి సర్టిఫికెట్లు జారీ చేయకూడదని సూచించారు. ఏడో బ్లాక్‌ను అదే సంస్థ పునరుద్ధరించాలనీ, ఇతర ఆనకట్టల్లో ఉన్న లోపాల సవరణ ఖర్చును కూడా ఎల్ అండ్ టీనే భరించాలని పేర్కొన్నారు. క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద కేసులు ప్రాజెక్టు బోర్డులో ఉన్న అధికారులపై క్రిమినల్ బ్రేచ్ ఆఫ్ ట్రస్ట్ కింద చర్యలు తీసుకోవాల్సిందిగా నివేదిక స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలకు పాలకులూ, అధికారులు, నిర్మాణ సంస్థలూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని అధికారుల కమిటీ తేల్చింది.