LOADING...
Kejriwal: సుప్రీంకోర్టుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​..కొద్దిసేపట్లో పిటిషన్​ విచారణ!

Kejriwal: సుప్రీంకోర్టుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​..కొద్దిసేపట్లో పిటిషన్​ విచారణ!

వ్రాసిన వారు Stalin
Apr 10, 2024
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. ఆయనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు 10.30 గంటలకు ఈ పిటిషన్ విచారణ కు వచ్చేలా చూడాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది డిమాండ్ చేశారు. మంగళవారం హైకోర్టు విచారణ సందర్భంగా ఈడీ అందించిన సాక్ష్యాధారాల మేరకు కేజ్రీవాల్ ఇతరులతో కలసి కుట్రలో పాల్గొన్నారని అభిప్రాయపడింది. లిక్కర్ పాలసీ కుంభకోణంలో కేజ్రీవాల్ తన వ్యక్తిగత ప్రయోజనాలను కూడా ఆశించారని హైకోర్టు పేర్కొంది. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ రిమాండ్ చట్టవిరుద్ధం కాదని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పు వెలువరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ఈడీ అరెస్టుపై సుప్రీంని ఆశ్రయించిన కేజ్రీవాల్