Page Loader
భవన నిర్మాణ కార్మికులకు కేజ్రీవాల్ గుడ్‌న్యూస్: ఉచిత బస్ పాస్‌లు; 75 శాతం రాయితో ఇళ్లు 
భవన నిర్మాణ కార్మికులకు కేజ్రీవాల్ గుడ్‌న్యూస్: ఉచిత బస్ పాస్‌లు; 75 శాతం రాయితో ఇళ్లు

భవన నిర్మాణ కార్మికులకు కేజ్రీవాల్ గుడ్‌న్యూస్: ఉచిత బస్ పాస్‌లు; 75 శాతం రాయితో ఇళ్లు 

వ్రాసిన వారు Stalin
Apr 25, 2023
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పనితీరును సమీక్షించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. దిల్లీలోని భవన నిర్మాణ కార్మికులకు రాయితీతో కూడిన గృహాలను అందించాలని కేజ్రీవాల్ ఆదేశించారు. దిల్లీలోని భవన నిర్మాణ కార్మికులందరికీ ఉచిత బస్‌పాస్‌లు, గ్రూప్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ట్రాన్సిట్‌ హాస్టళ్లు కల్పించాలని సంబంధిత శాఖను ఆదేశించారు. కేజ్రీవాల్ ప్రకటించిన నూతన ప్రణాళిక ప్రకారం ఎల్ఐజీ ఫ్లాట్‌లను నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం కేటాయిస్తుంది. భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల నిర్మాణంలో 75 శాతం ఖర్చును సర్కారే భరిస్తుంది. లబ్ధిదారుడు మిగిలిన 25 శాతం మాత్రమే చెల్లించాలి.

దిల్లీ

ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు పెద్ద ఎత్తున నైపుణ్య శిక్షణ 

మేస్త్రీలు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కార్పెంటర్లు, పెయింటర్లకు టూల్‌కిట్‌లు, నైపుణ్య శిక్షణ కూడా పెద్ద ఎత్తున అందించనున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. కేజ్రీవాల్ భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఉచిత కోచింగ్, సైట్‌లో క్రెచ్ సౌకర్యాల అభివృద్ధిని కూడా ప్రకటించారు. మహమ్మారి వల్ల ప్రభావితమైన, అనేక సవాళ్లతో పోరాడుతున్న దిల్లీలోని నిర్మాణ కార్మికులకు ఈ చర్యలు గణనీయమైన ఉపశమనం కలిగించాయి. దిల్లీలోని ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికునికి సంక్షేమ బోర్డు అందుబాటులో లేకపోవడం పట్ల సీఎం కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ బోర్డునుసమర్ధవంతంగా నిర్వహించడంతోపాటు ప్రతి కార్మికునికి పథకాలు అందేలా చూడాలని సీఎం ఆదేశించారు.