Page Loader
Kerala Couple: అరుణాచల్ ప్రదేశ్ లో కేరళ దంపతుల మృతి.. షాక్ లో కుటుంబసభ్యులు 
అరుణాచల్ ప్రదేశ్ లో కేరళ దంపతుల మృతి.. షాక్ లో కుటుంబసభ్యులు

Kerala Couple: అరుణాచల్ ప్రదేశ్ లో కేరళ దంపతుల మృతి.. షాక్ లో కుటుంబసభ్యులు 

వ్రాసిన వారు Stalin
Apr 03, 2024
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

అరుణాచల్ ప్రదేశ్ లోని ఓ హోటల్ లో కేరళలోని కొట్టాయంకు చెందిన దంపతులు,వారి స్నేహితుడు అనుమానస్పద రీతిలో మృతి చెందడం అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. వీరి మృతి పట్ల వారి కుటుంబసభ్యులు ఇంకా షాక్లోనే ఉన్నారు.ఈఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ బాలన్ మాధవన్ కుమార్తె దేవి కొట్టాయంకు చెందిన నవీన్ దంపతులు. కొట్టాయంలోనే చాలా కాలం నుంచి నివసిస్తున్నారు.అప్పుడప్పుడు తిరువనంతపురం వస్తూండేవారు. అయితే ఈ దంపతులిద్దరూ తన స్నేహితుడు ఆర్యతో కలసి అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ కు వెళ్లారు. అక్కడే హోటల్ రూమ్ అద్దెకు తీసుకున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా మంగళవారం ఈ ముగ్గురూ శరీరంపై గాయాలతో రక్తపు మడుగులో పడి నిర్జీవంగా పడి ఉన్నారు.

Details 

కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం

మంగళవారం ఉదయం అరుణాచల్ ప్రదేశ్ సీనియర్ పోలీసు అధికారి ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే చనిపోయిన దంపతులిద్దరికీ ఎటువంటి విబేధాలు లేవని,ఉన్నంతలో చాలా సంతోషంగా జీవితాన్నికొనసాగించారని బాలన్ మాధవన్ మీడియాకు తెలిపారు. అరుణాచల్లప్రదేశ్ కు వెళ్తున్నట్లు తనకు సమాచారమిచ్చారని ఆయన వెల్లడించారు.ఏం జరిగిందో ఎందుకిలా జరిగిందో తెలియడం లేదని ఆయన వాపోయారు. కాగా, దేవి జర్మన్ భాషల పట్ల చాలా ఆసక్తి కనబరిచేదని ఆయన తెలిపారు.కోవిడ్ కు కాలానికి ముందు కొద్దిరోజులపాటు చెంపాక స్కూల్లో పనిచేసిందని ఆయన వెల్లడించారు. మా బావమరిది ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని,ఆయన అక్కడ్నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్తారని చెప్పారు.ఆయన అక్కడకు వెళ్లిన తర్వాత మిగతా విషయాలు తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.