
నగ్నత్వం,అశ్లీలం ఒకటి కాదు.. కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలోని ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ రెహానా ఫాతిమాకు ఆ రాష్ట్ర హైకోర్టు ఉపశమనం కలిగించింది. కొడకు, కూతురుతో తన నగ్నదేహంపై పెయింటింగ్ వేయించుకున్నారు.
ఈ కేసు నుంచి ఆమెకు విముక్తి కల్పిస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఫాతిమా తన శరీరాన్ని బిడ్డలకు కాన్వాస్‌గా ఉపయోగించిందే తప్ప లైంగిక కోరికలను తీర్చుకునేందుకు కాదని హితవు పలికింది.
కొన్నాళ్ల కిందట ఫాతిమా నెట్టింట ఓ వీడియో షేర్ చేయగా, అది కాస్త వివాదాలకు కేంద్ర బిందువైంది. సదరు వీడియోలో ఫాతిమా తన శరీరంపై భాగంపై ఎటువంటి కదలికలు లేకుండా మంచంపై పడుకున్నారు. ఈ క్రమంలో ఆమె బిడ్డలిద్దరూ ఒంటిపై పెయింటింగ్ గీశారు.
Kerala High Court Grants Relief To Social Activist Rehana Fatima
మహిళలకు తమ శరీరాలపైనే హక్కు లేకుండా పోతోంది : హైకోర్టు
ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో ఫాతిమాపై పోక్సో చట్టం, జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఐటీ కింద పలు కేసులు నమోదు చేశారు పోలీసులు.
అయితే ఈ కేసును కొట్టేయాలంటూ తొలుత ట్రయల్ కోర్టును ఆశ్రయించిన ఫాతిమాకు అక్కడ అశాభంగం ఎదురైంది. చేసేది లేక హైకోర్టును ఆశ్రయించగా ఫాతిమాకు తీర్పు అనుకూలంగా వచ్చింది.
ఈ కేసుపై స్పందించిన న్యాయమూర్తి నగ్నత్వం, అశ్లీలం ఒకటి కాదన్నారు.మహిళలకు తమ శరీరాలపైనే హక్కు లేకుండా పోతోందన్నారు.
ఏ నిర్ణయం అయినా తీసుకునే స్వేచ్ఛ, హక్కు స్త్రీలకు ఉంటుందంటూ జడ్జి స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ ద్వారా వారికి సంక్రమించిన హక్కు అని వివరించారు.