Kerala Assembly polls: అప్పుల్లో కేరళ రికార్డు.. రూ. 5లక్షల కోట్లు దాటింది : నరేంద్ర మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో వాతావరణం భిన్నంగా ఉందని, మార్పు కోసం ప్రజలు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారని ఆయన చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటముల వ్యవహారాలను కఠినంగా విమర్శించారు. దశాబ్దాలుగా ఈ రెండు కూటములు రాష్ట్రాన్ని దోచుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని,వారి వాగ్దానాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మోదీ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి మోదీ వ్యాఖ్యల ప్రకారం, కేరళ దశాబ్దాలుగా స్వార్థ రాజకీయాల మధ్య చిక్కుకుపోయింది. మేం అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దుతాము. రెండు కూటములు అనేక కుంభకోణాలకు పాల్పడుతూ అధికారాన్ని మారుస్తూనే ఉన్నాయి, కానీ ఒకరిపై ఒకరు ఎప్పుడూ చర్యలు తీసుకోలేదు.
వివరాలు
మే 4న కౌంటింగ్
నిధుల దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయి. అంతేకాదు, జాతీయ స్థాయిలో ఈ రెండు కూటములు కలిసి పనిచేస్తుంటే, రాష్ట్రంలో మాత్రం ప్రత్యర్థులుగా వ్యవహరిస్తాయని ఆయన గుప్పించారు. అదేవిధంగా ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. రాష్ట్ర అప్పు రూ.5 లక్షల కోట్లను దాటింది. కొన్నేళ్లలోనే ఈ విపరీతమైన అప్పు పెరుగుదల చోటుచేసుకుంది. రాష్ట్ర ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిపరులను వెంటనే గుర్తించి డబ్బును రికవరీ చేసి రాష్ట్రాభివృద్ధికి ఖర్చు చేస్తామని ప్రధాన మంత్రి మోదీ హామీ ఇచ్చారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రంలో పోలింగ్ ఏప్రిల్ 9, కౌంటింగ్ మే 4న జరగనుంది.