Page Loader
Kerala Raging: వాయనాడ్ హాస్టల్ లో ర్యాగింగ్..బట్టలు విప్పి ఉరేగింపు ..కేసులో సంచలన విషయాలు
వాయనాడ్ హాస్టల్ లో ర్యాగింగ్..బట్టలు విప్పి ఉరేగింపు ..కేసులో సంచలన విషయాలు

Kerala Raging: వాయనాడ్ హాస్టల్ లో ర్యాగింగ్..బట్టలు విప్పి ఉరేగింపు ..కేసులో సంచలన విషయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2024
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

కేరళలోని వాయనాడ్ జిల్లాలో హాస్టల్ వాష్‌రూమ్‌లో కాలేజీ విద్యార్థిని మృతదేహం లభ్యమైన కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. 20 ఏళ్ల సిద్ధార్థన్,వెటర్నరీ మెడికల్ విద్యార్థి. సిద్ధార్థన్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. అతను ఆత్మహత్య చేసుకునే ముందు 29 గంటల పాటు చిత్రహింసలకు గురైనట్లు నివేదికలో వెల్లడైంది. ఆ వేధింపులు తట్టుకోలేక ఫిబ్రవరి 18న సిద్ధార్థన్ వాష్‌రూమ్‌లో ఉరి వేసుకునిఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్ధార్థన్ మరణ సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమ కుమారుడు ర్యాగింగ్‌ తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆరోపించారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) విద్యార్థులతో పాటు హాస్టల్‌లోని కొందరు విద్యార్థులు సిద్ధార్థన్‌ను ర్యాగింగ్ చేశారని చెబుతున్నారు.

ర్యాగింగ్ 

బట్టలు విప్పి నగ్నంగా ఊరేగించారు 

ఈ క్రమంలో చిత్రహింసలకు గురిచేసి మూడు రోజులుగా ఆహారం,నీళ్లు ఇవ్వకుండా ఆకలితో అలమటించేలా చేశారు. ఆ విషయం ఇంట్లో కూడా చెప్పి వాపోయాడు.అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. మృతుడు సిద్ధార్థన్ మృతదేహంపై పలు గాయాల ఆనవాళ్లు ఉన్నాయని చెబుతున్నారు. ర్యాగింగ్ సమయంలో సిద్ధార్థన్ దుస్తులు,లోదుస్తులను కూడా తొలగించి,ఆ తర్వాత హాస్టల్‌కు తీసుకెళ్లారని కాలేజీ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ మధ్యంతర నివేదిక పేర్కొంది. దీంతో పాటు సిద్ధార్థన్‌ను కూడా దారుణంగా కొట్టారని తెలిపింది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి మరుసటి రోజు ఫిబ్రవరి 17వ తేదీ వరకు సిద్ధార్థన్‌ను చేతులు,బెల్టుతో నిరంతరం కొట్టినట్లు విచారణ నివేదికలో పేర్కొన్నారు. ర్యాగింగ్‌ వల్ల మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.ఆతర్వాత ఫిబ్రవరి 18న వాష్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సస్పెండ్ 

18 మంది సస్పెండ్.. కేసు విచారిస్తున్న సీబీఐ  

ఈ ఘటన సంచలనం కావడంతో 18మందిని విశ్వవిద్యాలయం సస్పెండ్ చేసింది. అనుమానితుల్లో ఎస్‌ఎఫ్‌ఐ యూనిట్ సెక్రటరీ అమల్ ఎహసాన్, కాలేజీ యూనియన్ ప్రెసిడెంట్ కె అరుణ్,యూనియన్ సభ్యుడు ఆసిఫ్ ఖాన్ ఉన్నారు, వీరంతా లెఫ్ట్ స్టూడెంట్స్ యూనియన్ సభ్యులు. ఇదిలావుండగా,కేరళ హైకోర్టు ఆదేశాలతో రెండు రోజుల తర్వాత సీబీఐ కేసు దర్యాప్తును చేపట్టింది. నలుగురు సభ్యుల సీబీఐ బృందం వాయనాడ్ కేరళ పోలీసు అధికారులతో సమావేశమైంది. దీంతో పాటు సిద్ధార్థన్ కుటుంబ సభ్యులను కూడా సీబీఐ కలుసుకుని వారి వాంగ్మూలాలను నమోదు చేయనుంది. ఈ కేసులో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడిచే కాలేజీ యూనియన్ సభ్యులు, ఆ సంస్థ స్థానిక నాయకులతో సహా కనీసం 18 మందిని అరెస్టు చేశారు.